ఉత్తరాఖండ్ అసోసియేషన్ ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
ఉత్తరాఖండ్ అసోసియేషన్ ఆఫ్ చికాగో (UAC) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహాడి సంస్కృతిని ప్రదర్శిస్తూ, మా నందా దేవీ డోలీ యాత్ర, సంప్రదాయ జానపద నృత్యాలు, పహాడీ ఫ్యాషన్ వాక్ లాంటి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించుకున్నారు.
UAC అధ్యక్షుడు మోహన్ రావత్, బోర్డు సభ్యులు వినీత్ భండారి, హరీష్ చౌహాన్, ప్రశాంత్ పంత్, సౌరభ్ సింగ్, అనూప్ దబ్రాల్, వివేక్ రావత్ మరియు రవి రావత్, అలాగే విశిష్ట అతిథులు డాక్టర్ అజిత్ పంత్ మరియు మనేష్ శాస్త్రి దీప ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే భారతీయ, అమెరికా జాతీయ గీతాలను ఆలాపించారు కూడా.
తన సతీమణి ఆర్తి రావత్‌తో కలిసి వచ్చిన అధ్యక్షుడు రావత్, సభకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సామాజిక భాగస్వామ్యం, సాంస్కృతిక పరిరక్షణ మరియు సమిష్టి కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఉత్తరాఖండ్ సంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను సజీవంగా ఉంచడానికి సంఘం కట్టుబడి ఉందని కూడా ఆయన ప్రముఖంగా తెలిపారు.
ఉత్తరాఖండ్ సమాజ సభ్యులు, వారి కుటుంబాలు, స్నేహితులు మరియు విశిష్ట అతిథులు ఇల్లినాయిస్లోని అశ్యానా బాంకెట్స్‌లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ఫ్యాషన్ వాక్, ఉత్తరాఖండ్ విశేషాలు, రాఫెల్ బహుమతులతో ఉత్సవాలు జరిగాయి.







