ఒకే పాయింట్.. రెండు సినిమాలు.. ఆసక్తికర పోరు!
ఒకే తరహా కథాంశంతో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్(Dulquer salman) నటించిన ఆకాశంలో ఒక తార(aakasam lo oka taara), డియర్ ఆస్ట్రోనాట్(Dear Astronaut) సినిమాల్లో ఓ పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కల, ఆమె ఆశయానికి అండగా నిలిచే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఈ కథాంశంతో 2021లోనే కార్తీక్ భాగ్యరాజ్(Karthik Bhagyaraj) అనే ఎన్నారై కౌగిలి(Kougili) పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మంచి రెస్పాన్స్ రావడంతో దానిని ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. 2022 జనవరి 1న ఇదే పేరుతో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తన కథతో సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆకాశంలో ఒక తార కూడా ఇలాంటి కథతో రూపొందుతోందని కార్తీక్‌కు తెలిసింది. ఈ విషయంపై సదరు డైరెక్టర్ తో మాట్లాడినప్పటికీ, తమది ఇండిపెండెంట్ గా డెవలప్ చేసిన కథేనని ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించాలనే సూచనలు వచ్చినా కార్తీక్ కంప్లైంట్ చేయకుండా తన సినిమా పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టారు. మరోవైపు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డియర్ ఆస్ట్రోనాట్ చూసి ప్రశంసించడంతో ఈ ఇండిపెండెంట్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది.
ఇవి కూడా చదవండి
ప్రముఖ నిర్మాణ సంస్థల అండతో ఆకాశంలో ఒక తార భారీ స్థాయిలో తెరకెక్కగా, డియర్ ఆస్ట్రోనాట్ మాత్రం లిమిటెడ్ బడ్జెట్ తో పూర్తైంది. రెండు సినిమాల కథల్లో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ పాత్రల నేపథ్యాలు, కథనం భిన్నంగా ఉండనున్నాయి. నవంబర్ 20న ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటంతో, ఒకే తరహా కథాంశంతో వస్తున్న ఈ సినిమాల్లో ఆడియన్స్ ను ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.







