కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నా – దర్శకుడు, నిర్మాత ఎం.జె. నాయుడు
ఖుషీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విహాన్ కార్తీక్ హీరోగా MJ నాయుడు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం “కెరూబ్”. గత, వర్తమాన, భవిష్యత్తు అనేవి ట్యాగ్ లైన్స్. ఈ చిత్రానికి సంగీతం సత్య రాధాకృష్ణ అందించగా, రమేష్ తోకల సినిమాటోగ్రఫీ అందించారు.
సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ… సినిమా టీజర్, ట్రైలర్ చూడగానే.. మన ఫారెస్ట్ లో చేసిన అవతార్ లాగా అనిపించింది. మన తెలంగాణ లో ఇంత అందమైన అడవుకున్నాయా అనిపించింది. మరో రామాయణం అంత హిట్ కావాలని కోరుకుంటున్న. హీరో చాలా అందంగా మరో విజయ్ దేవరకొండ, నాని లాగ ఉన్నాడు. మంచి భవిష్యత్తు ఉంది. ట్రయిలర్ చూస్తుంటే దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉంది అనిపిస్తోంది.
ఈచిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత M.J.నాయుడు మాట్లాడుతూ… నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా వాటితో సంబంధం లేదు అనిపిస్తోంది ఈ స్టేజ్ వరకు రావటంతో. కుటుంబం సపోర్ట్ తో ఈ సినిమా చేయగలిగాను. దాదాపు 16 ఏళ్లలో ఈ సినిమా తీయగలిగాను. నాకు సినిమాటోగ్రాఫర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. గతంలో నా షార్ట్ ఫిలింకి తనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కు తనే అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఏది కావాలన్న అప్పటికప్పుడు చేసి ఇచ్చేవాడు. లిరిక్ రైటర్ అలరాజు నాకు ఎలా కావాలి అంటే అలా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను ఎలా అడిగితే అలా చేసి ఇచ్చాడు. నా ఫ్రెండ్, తమ్ముడు లాంటి హీరో విహాన్ సపోర్ట్ ఎంతో ఉంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా.
హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ…. సినిమాలోకి రావడానికి నాకు నా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. మొదట్లో నేను ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించా. అప్పుడే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎంతో రుణపడి ఉన్న. ఓ కొత్త ఫేస్ కావాలని నన్ను ఎంచుకున్నారు. దర్శకుడు ఎంతో డీటెయిల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ లోకేషన్స్ ను సెట్ చేశారు. దర్శకుడితో ఆల్ మోస్ట్ 7 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నా. దాని ఫలితం ఈ నెల 20న సినిమా విడుదల అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇద్దరం కలిసి పని చేయాలనుంటున్నా.
సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ మాట్లాడుతూ… ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. ఈ సినిమాకి మంచి లిరిక్స్ కుదిరాయి. నన్ను హీరో విహాన్ కార్తీక్ ఈ సినిమాకి రెఫర్ చేశారు. నిజంగా ఈ సినిమాకి పని చేయడం ఓ సాహసమే అని చెప్పాలి. మ్యూజిక్ బాగా కుదిరింది. మీకందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా.
DOP మాట్లాడుతూ… MJ నాయుడు లేకుంటే ఈ సినిమాకి పనిచేసే వాణ్ణి కాదు. చిన్నప్పటి నుంచి ఇద్దరం స్నేహితులం. రాత్రి విజువల్స్ కోసం ఎంతో కస్టపడి పని చేశాం. దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా విజువల్స్ కోసం తపన పడేవారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కస్టపడి పనిచేశారు. మీరు వెండి తెర మీద విజువల్స్ ను ఎంజాయ్ చేస్తారు.







