బే ఏరియా రాధాకృష్ణ ఆలయంలో ‘‘దీపావళి మహోత్సవ్ 2026″ వేడుకలు
బే ఏరియా రాధాకృష్ణ ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు నడుస్తున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు అత్యంత వైభంంగా ‘‘దీపావళి మహోత్సవ్ 2026 వేడుకలు జరగనున్నాయి. పూజలు, అభిషేకాలు, కీర్తనలు, భక్తి సంగీతం, దీపావళి మేళా మరియు పవిత్రమైన 1008 దీపాల వెలుగులతో ఈ వేడుకలు కన్నులపండువగా సాగనున్నాయి.
వేడుకల వివరాలివీ…
నవంబర్ 6 : ధనతేరస్ మహోత్సవ్
శ్రీ గణేష్ పూజ, మహాలక్ష్మి పూజ, భగవాన్ ధన్వంతరి పూజ, మహాలక్ష్మి కేసర్ అభిషేకం మరియు కుంకుమ అర్చన వుంటుంది. రాత్రి 8:00 నుంచి 9:00 వరకు, భోగ్, హారతి, శ్రీ రామ్ కీర్తనలు మరియు అనంతరం ప్రీతి భోజ్ (ప్రసాద వితరణ) ఉంటుంది.
నవంబర్ 7 (శనివారం) – కాళీ చౌదాస్ & దీపావళి మేళా:
అఖండ హనుమాನ್ చాలీసా పాఠ్, హనుమజ్జీ పూజ & అభిషేకం, 108 దీపాల వెలుగులు మరియు ప్రత్యేక హనుమత్ ఆరతి వుంటుంది.
సాయంత్రం 6:00 PM నుండి రాత్రి 9:00 PM వరకు హనుమజ్జీ పూజ, దీపావళి మేళా మరియు ‘బే రాగీస్’ (Bay Raagis) ఆధ్వర్యంలో లైవ్ భక్తి సంగీత కచేరీ జరుగుతుంది.
నవంబర్ 8 (ఆదివారం) – దీపావళి మహాపర్వ్:
ఉదయం 11:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు సండే satsang (సత్సంగ్), సీతా రామ్ అభిషేకం & కీర్తనలు, తదుపరి ప్రీతి భోజ్ ఉంటుంది.
సాయంత్రం 6:30 PM నుండి 7:30 PM వరకు శ్రీ గణేష్ & మహాలక్ష్మి పూజలతో దీపావళి పూజ నిర్వహిస్తారు.
సాయంత్రం 7:30 PM నుండి గ్రాండ్ లైటింగ్ ఆఫ్ 1008 దీయాస్ (1008 దీపాల వెలుగుల వేడుక) ప్రారంభమై, తదుపరి ప్రీతి భోజ్‌తో వేడుకలు ముగుస్తాయి.
రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ బే ఏరియా, 4411 హైలాండ్ ఏవెన్యూ, సాన్ జోస్, CA 95127.
మరిన్ని వివరాల కోసం (669) 200-9358 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా rktbayarea.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.







