సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్) థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో దుల్కర్ సల్మాన్
ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు..
నిర్మాత మాట్లాడుతూ ”సుడిగాలి సుధీర్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెతో నిర్మించిన చిత్రమిది. ఆయన క్రేజ్‌కు తగ్గ కథను ఎన్నుకుని ఈ సినిమా నిర్మించాను. ఆయన పాత్ర నేటి యువత కనెక్ట్ అవుతుంది. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.







