శ్రీ శివ విష్ణు ఆలయంలో రెండు రోజలు పాటు ముత్తుస్వామి, శ్యామాశాస్త్రి సంగీతోత్సవాలు
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం లాన్హామ్లో ఉన్న ప్రసిద్ధ శ్రీ శివ విష్ణు ఆలయం (SSVT) ఆధ్వర్యంలో 23వ వార్షిక శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్రీ శ్యామ శాస్త్రి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 31, నవంబర్ 1 వ తేదీన ఈ రెండు రోజుల పాటు ఈ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5:00 గంటలకు ఈ సంగీత కచేరీ ప్రారంభం అవుతుంది. శ్రీ శివ విష్ణు టెంపుల్ 6905 సిప్రియానో రోడ్ లాన్హామ్, MD 20706 (SSVT ఆడిటోరియం) వేదికగా ఈ సంగీత కచేరీ జరగనుంది.
ఈ సంగీత కచేరీలో పాల్గొనే ప్రముఖ సంగీత విద్వాంసులు వీరే..
గాత్రం: విద్వాన్ విగ్నేష్ ఈశ్వర్ (Vid. Vignesh Ishwar)
మృదంగం: విద్వాన్ ప్రవీణ్ స్పర్ష్ (Vid. Praveen Sparsh)
ఘటం: విద్వాన్ చంద్రశేకర శర్మ (Vid. Chandrasekara Sharma)
వాయిలిన్: విద్వాన్ సయీ రక్షిత్ (Vid. Sayee Rakshith)

ఇక.. నవంబర్ 1 న జరిగే కార్యక్రమాలివీ…
అక్టోబర్ 31వ తేదీ శనివారం సాయంత్రం ఎస్.ఎస్.వి.టి. ఆడిటోరియంలో ప్రముఖ కళాకారులతో కూడిన అద్భుతమైన శాస్త్రీయ సంగీత కచేరీ జరగనుంది.
గాత్రం: విద్వాన్ విగ్నేష్ ఈశ్వర్
వాయులీనం (వయోలిన్): విద్వాన్ సయీ రక్షిత్
మృదంగం: విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్
ఘటం: విద్వాన్ చంద్రశేఖర శర్మ
సంగీత ప్రియులందరికీ ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం (Admission Free) అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు మరియు సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, ఈ దివ్య సంగీత కచేరీని వీక్షించి తరించాలని కోరుచున్నారు. విరాళాలు ఇవ్వాలనుకునేవారు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చని నిర్వాహకులు కోరారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు [email protected] మెయిల్ ద్వారా సంప్రదించవలసిందిగా నిర్వాహకులు కోరారు.








