బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లాలోని అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పర్యటించారు. మొగల్తూరు(Mogalturu) మండలం మెట్రేవు పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రంలో భోజన వసతులు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. తుపాను దృష్ట్యా అధికారులు ముందు అప్రమత్తం చేశారని, పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారని గ్రామస్థులు తెలిపారు. తుపాను అనంతరం నష్టాలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. కూలిన చెట్లను తొలగిస్తూ విద్యుత్ స్తంభాలు (Electricity poles) పునరద్ధరిస్తున్నామన్నారు. రేసు సాయంత్రం లేదా ఎల్లుండికల్లా స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు. పునరుద్ధరణ పనుల్లో వేలాది మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. తుపాను ధాటికి బోట్లు (Boats) కొట్టుకుపోయాయని, తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.








