ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddi Mithun Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు పోలీసులు తనపై నమోదు చేసిన 4 కేసులు కొట్టివేయాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణకల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మిథున్ రెడ్డి వల్ల 30 మంది గాయపడ్డారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లపై విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల సందర్భంగా పుంగనూరు (Punganur)లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.








