ఎస్ఈసీ కీలక నిర్ణయం … ఆన్లైన్ లో
స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు (Nomination papers), అఫిడవిట్లను ఎస్ఈసీ వెబ్సైట్ (SEC website)లో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు (High Court) సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏలూరు జిల్లా నూజీవీడుకు చెందిన శివకార్తీక్ (Sivakarthik) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్ (Online)లో ఉంచుతామని ఉన్నత న్యాయస్థానానికి ఎస్ఈసీ తెలిపింది. సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.








