పంటి నొప్పి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. డెంటిస్ట్ దగ్గరకు వెళ్లేలోపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ఇంట్లోనే పాటించగల బెస్ట్ చిట్కాలు ఇవే!
లవంగంలో ఉండే యూజినాల్ (Eugenol) సహజ అనల్జెసిక్గా పనిచేస్తుంది. నొప్పి ఉన్న పంటి దగ్గర లవంగం లేదా లవంగం నూనె రాసిన దూదిని ఉంచితే నొప్పి వెంటనే తగ్గుతుంది.
లవంగం లేదా లవంగం నూనె
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పు కలిపి నోటిని బాగా పుక్కిలించాలి. ఇది నోట్లోని బ్యాక్టీరియాని నశింపజేసి, వాపును తగ్గిస్తుంది.
ఉప్పు నీటి పుక్కిలింపు
బుగ్గపై నొప్పి ఉన్న వైపు ఐస్ క్యూబ్స్‌ను క్లాత్‌లో చుట్టి 15 నిమిషాల పాటు ఒత్తి పడితే.. రక్తనాళాలు కుంచించుకుపోయి నొప్పి భావన తగ్గుతుంది.
ఐస్ ప్యాక్
వెల్లుల్లిలో 'అల్లిసిన్' అనే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుంది. కొద్దిగా వెల్లుల్లినిజ్జెక్కి, దానికి ఉప్పు కలిపి నొప్పి ఉన్న పంటిపై పెట్టాలి.
వెల్లుల్లి రెబ్బలు
పసుపులో ఉండే కుర్కుమిన్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. చిటికెడు పసుపు, కొన్ని చుక్కల ఆవనూనె కలిపి పంటి చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేయాలి.
పసుపు & ఆవనూనె పేస్ట్
వాడి చల్లారిన పేపర్మింట్ టీ బ్యాగ్‌ను నొప్పి ఉన్న పంటి దగ్గర కొద్దిసేపు ఉంచితే అందులోని మెంతోల్ వల్ల పంటి నొప్పి, చిగుళ్ల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
పేపర్మింట్ టీ బ్యాగ్
లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ నీటితో నోరు పుక్కిలించడం వల్ల చిగుళ్ల వాపు, పంటి నొప్పి త్వరగా తగ్గుతాయి.
పేస్ట్ రూపంలో జామ ఆకులు
పంటి నొప్పి ఉన్నప్పుడు చాలా చల్లటి లేదా బాగా వేడిగా ఉన్న పదార్థాలను తినకూడదు. అలాగే తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే! పంటి నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా పదే పదే వస్తున్నా వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.