భువనేశ్వర్ కుమార్ పై అశ్విన్ రివ్యూ..!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన సీనియర్ స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనపై టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర రివ్యూ ఇచ్చాడు. ఐపీఎల్(IPL) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి సంచలన ఫామ్ చాటడం వల్లే భువీకి దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కిందని అశ్విన్ గుర్తుచేశాడు. అయితే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సీనియర్ బౌలింగ్ జంట ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అశ్విన్ స్పందించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శనకు మార్కులు ఇచ్చిన అశ్విన్.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు కఠినమైన రేటింగ్ ఇచ్చాడు. “ఈ రోజు ప్రదర్శన ఆధారంగా చూస్తే భువనేశ్వర్ కుమార్‌కు నేను 10 కి కేవలం 2 మార్కులు మాత్రమే ఇస్తాను” అని అశ్విన్ కామెంట్ చేసాడు. ఇదే మ్యాచ్‌లో దారుణంగా పరుగులు సమర్పించుకున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కూడా అతను 2 మార్కులే కేటాయించాడురు. పిచ్‌పై కివీస్ బ్యాటర్లు విరుచుకుపడుతున్న సమయంలో సీనియర్ బౌలర్లు మ్యాచ్‌ను కంట్రోల్లోకి తెవడంలో విఫలమయ్యారని విమర్శించాడు.
అదే సమయంలో యువ బౌలర్లయిన అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌ల అద్భుతమైన స్పెల్స్‌ను అశ్విన్ ఆకాశానికెత్తారు. వీరిద్దరి రన్‌రేట్ నియంత్రణ, వికెట్లు తీసిన తీరును అభినందిస్తూ ఇద్దరికీ 9 మార్కులు ఇచ్చాడు. భువీ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ, ఆధునిక టీ20 ఫ్లాట్ పిచ్‌లపై కేవలం స్వింగ్‌పైనే ఆధారపడకుండా వేరియేషన్లు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఈ లేటెస్ట్ అనాలసిస్ స్పష్టం చేస్తోంది. భువీ తన లోపాలను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్‌ల్లో పుంజుకుంటాడో లేదో చూడాలి.








