మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)తో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి (Karthik Reddy)లను మధురా నగర్ పోలీసులు హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గృహ నిర్బంధం చేయడంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వకపోయినా వేకువజామున 4 గంటల నుంచే పోలీసులు భారీగా మోహరించారన్నారు. తమను నిర్బంధించడంపై రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.








