రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగేలా గ్లోబల్ సమిట్ .. ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
డిసెంబర్ లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచ స్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు
ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించిన సీఎం
ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్ పో, ఇండియా జాయ్ ఈవెంట్ల పై అధికారులకు దిశానిర్దేశం
నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ ప్రముఖులను అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు
క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించాలన్నారు
ఆవ్ఘ్ఛ్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు.
తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు సూచించారు
కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు
బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు
సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








