రాజ్ కెసిరెడ్డి దేశం విడిచి వెళ్లొదు : సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj kc reddy)కి సుప్రీం కోర్టు (Supreme Court) షరతులు విధించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది. నిందితుడు విచారణకు సహకరించకపోతే బెయిల్ (Bail) రద్దు కోసం కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కెసిరెడ్డి అరెస్టు విధానం, ప్రొడక్షన్ వారెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు (High Court) మంజూరు చేసిన బెయిల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.








