మహానటి తర్వాత కీర్తి సురేష్‌కు అక్కతో మరో గుర్తింపు దక్కేనా?
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్(keerthy suresh) ఒకరు. మహానటి(Mahanati) సినిమాలో సావిత్రిగా తన అద్భుతమైన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించిన ఆమె నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. అయితే ఆ సినిమా సాధించిన సక్సెస్‌తో కీర్తి కెరీర్లో ఓ కొత్త బెంచ్‌మార్క్ ఏర్పడింది. ఆ తర్వాత పెంగ్విన్(Penguine), సాని కాయిదం(saani kayidham) వంటి విభిన్న కథా సినిమాలతో తన యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను చూపించినప్పటికీ, మహానటి స్థాయి ఇంపాక్ట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న అక్క(Akka) సిరీస్‌పై ఆసక్తి నెలకొంది.
పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కీర్తి సురేష్ భవానీ అనే శక్తిమంతమైన మహిళ పాత్రలో కనిపించనున్నారు. మహిళల ఆధిపత్యంలో నడిచే పెర్నూరులో అధికారం, ప్రతీకారం, వారసత్వం చుట్టూ కథ సాగనుంది. రాధికా ఆప్టే(Raadhika Apte) కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌లో కీర్తి లుక్ ఇప్పటికే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. పాత్రకు తగ్గట్టుగా తన నడక, మాటతీరు, హావభావాలపై స్పెషల్ కేర్ పెట్టినట్లు సమాచారం. ప్రమోషన్లలోనూ భవానీ పాత్ర ఛాయలు కనిపించేలా ఆమె వ్యవహరిస్తుండటం విశేషం.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, వాటిని సక్సెస్ఫుల్ సినిమాలుగా నిలబెట్టడం ఇప్పటికీ ఛాలెంజ్ గానే ఉంది. మూసధోరణులకు భిన్నంగా పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్లను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం అవసరం. కీర్తి సురేష్‌కు మరో మహానటి అవసరం లేదని, ఆమె టాలెంట్‌ను కొత్త యాంగిల్లో ఆవిష్కరించే పాత్ర కావాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్క ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇస్తుందో, భవానీ క్యారెక్టర్ తో ప్రేక్షకుల మనసుల్లో ఎంతటి ముద్ర వేస్తుందో చూడాలి.








