అలియాస్ రుక్మిణి నుంచి ఇంప్రెసివ్ గా రుక్కు రుక్కు సాంగ్..
నితిన్(nithin) హీరోగా నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం అలియాస్ రుక్మిణి(Alias Rukmini) నుంచి ఫస్ట్ సాంగ్ రుక్కు రుక్కు(rukku rukku) రిలీజైంది. కంటెంట్‌కు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురళీ కాంత్ దేవసోత్(Muralikanth Devasoth) దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంట(Deepthi Gant) నిర్మాతగా వ్యవహరిస్తుండగా, నేచురల్ స్టార్ నాని(Nani) ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇందులో నితిన్ కృష్ణ అనే పాత్రలో కనిపించనుండగా, రుక్మిణిగా ఆఫియా సయ్యద్(Aafiya syed) హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. తన భార్య పేరుతో పుస్తకాలు రాసే రైటర్ చుట్టూ సాగే ఈ ప్రేమకథపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
విజయ్ బుల్గానిన్(Vijay bulganin) స్వరపరిచిన రుక్కు రుక్కు సాంగ్‌కు అనురాగ్ కులకర్ణి(Anurag kulakarni) తన గొంతుతో ప్రాణం పోశారు. తన ప్రేమను అంగీకరించాలంటూ ప్రియురాలిని కోరుకునే కృష్ణ మనసులోని భావాలను ఈ సాంగ్ అందంగా ఆవిష్కరిస్తోంది. ఆమెను రాణిలా చూసుకుంటానని, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంచుతానని హామీ ఇచ్చే ప్రేమికుడిగా నితిన్ అభినయం ఆకట్టుకుంటోంది. సరళమైన వేషధారణలో సాధారణ ఉద్యోగి తరహా పాత్రకు సహజత్వాన్ని తీసుకొచ్చిన నితిన్, తనదైన డ్యాన్స్‌తోనూ అలరించారు.
డైరెక్టర్ మురళీ కాంత్ సాంగ్‌ను తెరకెక్కించిన తీరు, నితిన్- ఆఫియా సయ్యద్ మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తయింది. వినూత్నమైన ప్రేమకథగా రూపొందుతున్న అలియాస్ రుక్మిణిని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.








