బ్లాక్ శారీలో రాయల్ లుక్ లో అవతారమిచ్చిన మృణాల్
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదటి సినిమా సీతారామం(Sitaramam)తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సెలెక్టెడ్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న మృణాల్ ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మృణాల్ తాజాగా దీపావళి స్పెషల్ ఎడిషన్ ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ శారీలో ఎంతో రాయల్ అండ్ క్లాసీ లుక్ లో కనిపిస్తూనే ఆ అవుట్‌ఫిట్ కు మోడ్రన్ టచ్ ఇస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుండగా, ఈ శారీలో మృణాల్ ఎంతో అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ ఆమె ఫాలోవర్లు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








