బాలకృష్ణతో భేటీ అయిన రాజ్ అల్లాడ, ప్రేమ్ కాళిదిండి
ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATS) అధ్యక్షుడు రాజ్ అల్లాడ, NATS కన్వెన్షన్ 2027 కన్వీనర్ ప్రేమ్ కాళిదిండి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను కలుసుకున్నారు. ఇటీవలే జరిగిన శస్త్ర చికిత్స నుంచి బాలకృష్ణ వేగంగా కోలుకుంటున్నారని, అంతేకాకుండా తిరిగి సెట్స్ పైకి అడుగుపెట్టడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఈ భేటీ భాగంగా ఈ భేటీలో భాగంగా, భారతదేశంలోనూ మరియు అమెరికాలోనూ NATS చేపడుతున్న వివిధ సామాజిక, సమాజ సేవా కార్యక్రమాల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. జలకు, ముఖ్యంగా ఆపద సమయంలో ఎన్ఆర్ఐ (NRI)లకు NATS అందిస్తున్న అపరిమితమైన సేవలను బాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా అభినందించారు.
ఇవి కూడా చదవండి
ఇక.. సమాజానికి తిరిగి సేవ చేయాలన్న సంకల్పంలో భాగంగా తాము బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్ స్టిట్యూట్ కి మద్దతిస్తామని, అంతేకాకుండా కేన్సర్ బాధితులకు అవసరమయ్యే ప్రత్యేక సంరక్షణ కిట్లను పంచుతామని నాట్స్ పునరుద్ఘాటించింది.

అలాగే, మే 28, 29 మరియు 30, 2027 తేదీల్లో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే మా ప్రతిష్టాత్మక కార్యక్రమం — “NATS అమెరికా తెలుగు సంబరాలు 2027″కు గౌరవ అతిథిగా హాజరుకావాల్సిందిగా బాలకృష్ణ గారిని అధికారికంగా ఆహ్వానించాము.ఈ భేటీలో బాలయ్య తమను ఎంతో ప్రోత్సహించారని, ఆప్యాయంగా మాట్లాడారని, ఇందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని రాజ్ అల్లాడ, ప్రేమ్ కాళిదిండి ప్రకటించారు.








