14వ పెళ్లి రోజున నాని స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని(nani) తన పర్సనల్ లైఫ్ లో మరో అందమైన మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. తన భార్య అంజనా(Anjana)తో కలిసి నాని తమ 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన మెసేజ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. తమ వైవాహిక బంధాన్ని ఓ బ్లాక్‌బస్టర్ ప్రేమకథతో పోలుస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాని, అంజనా ప్రేమ ప్రయాణం ఐదేళ్ల పరిచయం, ప్రేమ తర్వాత వివాహ బంధంగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో 2012 అక్టోబర్ 27న విశాఖపట్నంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017లో కొడుకు అర్జున్(arjun) పుట్టాడు. అప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్ ను, వృత్తిపరమైన బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ నాని ముందుకు సాగుతున్నారు. సినిమా ఫంక్షన్స్, వ్యక్తిగత సందర్భాల్లో అప్పుడప్పుడు కనిపించే ఈ జంట బాండింగ్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటుంది.
ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి తగిన టైమ్ కేటాయిస్తుంటారు. స్క్రీన్ పై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, నిజజీవితంలోనూ కుటుంబానికి ప్రాధాన్యతనివ్వడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. 14 ఏళ్ల వైవాహిక ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాని, అంజనాలకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ, పరస్పర అవగాహనతో సాగుతున్న వారి ప్రయాణం మరెన్నో మధుర జ్ఞాపకాలతో కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
https://www.instagram.com/p/De_5rVnkvxF/?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==








