చరణ్-సుకుమార్ సినిమాలో కీలక పాత్రలో టాలెంటెడ్ యాక్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాపై టాలీవుడ్లో అప్పుడే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడంతో, మరోసారి ఈ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేయనుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఆర్సీ17(RC17)గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)ని సంప్రదించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కథలో కీలక మలుపుకు కారణమయ్యే పవర్ఫుల్ క్యారెక్టర్ ను సుకుమార్ ఈ సినిమా కోసం రెడీ చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం మరో సీనియర్ తమిళ హీరోను ఎంపిక చేయాలని భావించినప్పటికీ, రెమ్యూనరేషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. గతంలో సైరా నరసింహారెడ్డి(Syera narasimha reddy), ఉప్పెన(Uppena) సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆయన ఈ ప్రాజెక్టులో భాగమవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఇక పెద్ది(Peddi) తర్వాత రామ్ చరణ్ చేయనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. నవంబర్ 1న సినిమా ప్రారంభోత్సవం జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ అంశాలతో ఈ సినిమాను రూపొందించనున్నారనే వార్తలు ఫ్యాన్స్ లో అంచనాలను పెంచుతున్నాయి. సినిమా కథ, నటీనటులు, ఇతర వివరాలపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.








