మెగావర్స్తో ఓటీటీలోకి చిరంజీవి.. తొలి ఎపిసోడ్లో స్టార్ కమెడియన్లు!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi( సిల్వర్‌స్క్రీన్‌పై తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తూనే, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ పైనా సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మెగావర్స్ (Megaverse) పేరుతో ఆయన ఓ సెలబ్రిటీ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు సమాచారం. తాజాగా ఈ షో షూటిగ్ మంగళవారం ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ లో ఈ కొత్త కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
ఈ టాక్‌షో మొదటి ఎపిసోడ్ మరింత ఎంటర్టైనింగ్ గా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం(Brahmanandam), సునీల్(Suneel), సత్య(Satya) ఇందులో పాల్గొన్నారని సమాచారం. గెస్టులతో చిరంజీవి చేసే సంభాషణలు, వారి మధ్య చోటుచేసుకునే సరదా సంఘటనలు షోకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి సీజన్‌ను సుమారు 15 ఎపిసోడ్లతో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అయితే దీనిపై షో యాజమాన్యం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ఇప్పటికే బాలకృష్ణ(Balakrishna) అన్‌స్టాపబుల్, జగపతిబాబు(Jagapathi babu) జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌షోలకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను చాటుతున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి కూడా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, ఇప్పుడు టాక్‌షో ద్వారా మరోసారి తన మాటతీరు, కామెడీ టైమింగ్ తో అలరించనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మెగావర్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? గెస్టుల వివరాలపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.








