బిగ్‌బాస్ హోస్టింగ్ కు రమ్యకృష్ణకు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే?
సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ(Ramyakrishnan).. బుల్లితెరపైనా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా తమిళ బిగ్‌బాస్(Biggboss) సీజన్ 10లో హోస్ట్ గా ఆమె ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ షోకు వరుసగా మూడు సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి(Vijay sethupathi) గొంతు సంబంధిత సమస్యతో వీకెండ్ ఎపిసోడ్లకు దూరమైనట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్టింగ్ బాధ్యతలను స్వీకరించారు.
తనదైన గంభీరమైన స్వరం, స్పష్టమైన మాటతీరు, ఇంటి సభ్యులతో వ్యవహరించే విధానంతో రమ్యకృష్ణ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. పోటీదారుల ఆటతీరుపై ఆమె స్పందించిన తీరు కూడా షోకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆమె ఈ వీకెండ్ ఎపిసోడ్లకే పరిమితమవుతారా? లేక రాబోయే వారాల్లోనూ హోస్ట్ గా కంటిన్యూ అవుతారా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. షో నిర్వాహకుల నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ పై ఇంట్రెస్టింగ్ ప్రచారం సాగుతోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.15 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. రెండు వీకెండ్ ఎపిసోడ్లకు కలిపి ఈ మొత్తం రూ.30 లక్షల వరకు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాలను ఆమెగానీ, షో నిర్వాహకులుగానీ కన్ఫర్మ్ చేయలేదు. గతంలో తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో, తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లోనూ తాత్కాలికంగా హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణ.. మరోసారి ఈ బాధ్యతలు చేపట్టడం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.








