మెట్రో పాలిటన్ వాషింగ్టన్ హిందూ ఆలయం ఆధ్వర్యంలో ‘కరవా చౌత్’’ వేడుకలు
మెట్రో పాలిటన్ వాషింగ్టన్ హిందూ ఆలయం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ‘‘కరవా చౌత్’’ వేడుకలను నిర్వహించనున్నారు. వివాహం అయిన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం, శ్రేయస్సు కోసం ఈ పవిత్ర వేడుకను నిర్వహిస్తారు. ఇందుకోసం మహిళలు తమ కుటుంబీకులు, స్నేహితులతో కలిసి తరలి రావాలని, దేవాలయంలో ఘనంగా కరవా చౌత్ జరుపుకోవాలని ఆహ్వానించారు.
అక్టోబర్ 29 వ తేదీన, ది హిందూ టెంపుల్ ఆఫ్ మెట్రోపాలిటన్ వాషింగ్టನ್, 10001 రిగ్స్ రోడ్, అడెల్ఫి, MD 20783 వేదికగా జరగనుంది. సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఈ కార్యక్రమం వుంటుంది. 8 గంటల తర్వాత హారతి వుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు సాయంత్రం 3:30 కల్లా ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు కోరారు. మొదటి పూజ సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. భక్తులు తమ సొంత పూజా థాలీలను తెచ్చుకోవాల్సి వుంటుందని కూడా సూచించారు. నేరుగా పాల్గొనలేని వారు ఆన్ లైన్ ద్వారా వీక్షించే సౌలభ్యం కూడా కల్పించారు.
మరిన్ని వివరాల కోసం లేదా ఆలయ విరాళాల కోసం అధికారిక వెబ్సైట్ www.hindutemplemd.org ను సందర్శించవచ్చు.








