‘‘నెల నెలా తెలుగు వెన్నెల’’ లో భాగంగా ‘‘దశావధానం’’
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘‘నెల నెలా తెలుగు వెన్నెల అనే తెలుగు సాహిత్య వేదిక జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాషకి సంబంధించిన కార్యక్రమాలు వుంటాయి. ఇందులో భాగంగానే 19 వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం అక్టోబర్ 24 వ తేదీన జరగనుంది. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం వుంటుంది. FRISCO FLYERS EVENT CENTRE, 6300 FLYERS WAY FRISCO TX 75034 వేదికగా ఈ 19 వ వార్షికోత్సవం జరగనుంది.
19 వ వార్షికోత్సవం, 231 వ సాహిత్య సదస్సుకు సాహితీ బంధువులందరికీ కూడా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ఈ సందర్భంగా హిందీ, తెలుగు మేలు కలయికలో తొలిసారిగా ‘‘దశావధానం’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దశావధానాన్ని అవధాని, ప్రవాసాంధ్ర అవధాన ప్రభాకర బిరుదాంకితులు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి తక్షణ పూర్వాధ్యక్షుడు, దయాకర్ మాడ, సమన్వయకర్త, పాలకమండలి సభ్యులు, ఉదయ్ కిరణ్ నిడిగంటి ఉత్తరాధ్యక్షులు, కమలాకర్ దేవకకొండ, నిడిగంటి గోవర్ధనరావు, సునీల్ సూరపరాజు, పవన్ కర్రా, లెనిన్ బందా, ఎస్.కె.ఎన్. రాజు, లెనిన్ బాబు వేముల, నవీన్ గొడవర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్ నర్స్ గా తెలుగు టైమ్స్, సాక్షి, మహా న్యూస్, టీవీ9, టీవీ5, ఆంధ్రజ్యోతి ఏబీఎన్, NRI 2 NRI, NRI PAGE వ్యవహరిస్తున్నారు.








