గోల్డ్ కలర్ శారీలో బంగారంలాగా మెరిసిపోతున్న రకుల్
వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను తెచ్చుకుంది. గత కొంతకాలంగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయిన రకుల్, తాజాగా రాయల్ లుక్ లో కనిపించింది. రకుల్ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో బంగారు వర్ణం టిష్యూ శారీ, దానికి డిజైనింగ్ మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి చెవులకు గోల్డ్ చాంద్ బాలి, చేతులకు బంగారు గాజులు ధరించి, నుదుటిని బొట్టు పెట్టుకుని ఎంతో అందంగా మెరవగా, ఈ ఫోటోల్లో రకుల్ అందాన్ని పొగడటానికి మాటలు సరిపోవడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








