ఫేయిర్ ఫాక్స్ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ లో బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం
వర్జీనియాలోని ఫేయిర్ ఫాక్స్ లో వున్న శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్ లో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను ఆలయ సిబ్బంది విడుదల చేశారు. అక్టోబర్ 17 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకూ ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.
మంచి మంచి పూవ్వులతో బతుకమ్మలను అందంగా తయారు చేసి, పేర్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సెలబ్రేషన్స్ కి మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురావొచ్చు. దీని ద్వారా అందరూ కలిసి బతుకమ్మను ఆడటం ద్వారా మరింత శోభ చేకూరుతుంది.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 17
సమయం : సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు
వేదిక : SV LOTUS TEMPLE
12501 BRADDOCK RD,
FAIRFAX, VA 22030








