‘ఎం4ఎం’ చిత్రానికి ఉత్తమ డెబ్యూ హీరోయిన్గా జో శర్మ.. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ వేడుకల్లో ఘన సత్కారం!
విజయవాడ వేదికగా ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (APFCC) దశాబ్ది వేడుకల్లో యువ నటి, హీరోయిన్ జో శర్మ (Jo Sharma) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎం4ఎం – మోటివ్ ఫర్ మర్డర్(M4M – Motive for Murder) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ డెబ్యూ హీరోయిన్(Best Debut Heroine Award) పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
దిగ్గజాల సమక్షంలో చిరస్మరణీయ క్షణాలు
సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మురళీమోహన్ చేతుల మీదుగా ఈ గుర్తింపు పొందడం తన జీవితంలో ఎప్పటికీ మరువలేని క్షణమని జో శర్మ తెలిపారు. ఈ వేడుకలో నిహారిక కొణిదెల, లయ, ఎన్నారై కోమటి జయరామ్ తదితర ప్రముఖ సినీ తారలతో వేదికను పంచుకోవడం ఎంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ‘ఎం4ఎం’ చిత్రంలో తనకు హీరోయిన్గా అవకాశం కల్పించి ప్రోత్సహించిన మోహన్ వడ్లపట్ల గారికి ఆమె తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇదే వేదికపై పురస్కారం అందుకున్న మురళీ మోహన్ గారికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆమె పేర్కొన్నారు.









