ఎపెక్ సమ్మిట్ లో ట్రంప్, పుతిన్ జిన్ పింగ్..!
ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద దేశాలైన అమెరికా, రష్యా , చైనా అధినేతలు ఒకేవేదికపైకి వస్తే.. అది చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్.వారు ఏం మాట్లాడుకుంటున్నారు.. ఏం చర్చిస్తున్నారు అన్న అంశంపైనే ప్రపంచం తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. అలాంటి పరిణామమే ఎపెక్ సమ్మిట్ సందర్భంగా చోటు చేసుకుంది.
చైనాలోని షెంజెన్‌లో అగ్రదేశాధినేతలు ఒకే వేదికపై కనిపించారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఎపెక్) సమిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సమిట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా అధినేత షీ జిన్‌పింగ్ కలిసి కను‘విందు’ చేశారు. దేశాధినేతల గౌరవార్థం జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ ఇచ్చిన విందులో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ట్రంప్, జిన్‌పింగ్ విందు జరుగుతున్న హాలులో ఉండగా.. రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ పుతిన్ వారివైపు వచ్చారు. రాగానే ట్రంప్, పుతిన్ కరచాలనం చేసుకున్నారు. ఒకరి భుజం ఒకరు తట్టుకుని అభినందనలు తెలుపుకొన్నారు.
ఇవి కూడా చదవండి
జిన్‌పింగ్‌తో పుతిన్ చర్చలు
ట్రంప్ కంటే కొన్ని గంటల ముందే పుతిన్ షెంజెన్ చేరుకున్నారు. జిన్‌పింగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రెండు దేశాలు అనుసరిస్తున్న విదేశాంగ విధాన వ్యూహం ఫలిస్తోందని తెలిపారు.
ట్రంప్‌నకు జిన్‌పింగ్ స్వయంగా స్వాగతం
ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో షెంజెన్ చేరుకున్న ట్రంప్‌నకు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లిన జిన్‌పింగ్.. ఆయనకు స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు. సైనిన వందనంతోపాటు చిన్నారులు ట్రంప్‌నకు పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఫైటర్ జెట్లు స్వాగత విన్యాసాలు చేశాయి.
ట్రంప్‌తో లోతైన చర్చలు జరపాలని జిన్‌పింగ్ కోరుకుంటున్నారని చైనా వార్తాపత్రికలు తెలిపాయి. రెండు దేశాల బంధాన్ని మరింత బలపరుచుకోవాలని, ఆసియా-పసిఫిక్‌లో సహకారాన్ని తీసుకోవాలని, అంతర్జాతీయ వ్యవహారాలను గాడినపెట్టడానికి సహకరించుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించాయి. గత సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్, ఆయన సతీమణి విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికిన సంగతిని జిన్‌పింగ్ గుర్తుచేసుకున్నారని తెలిపాయి..







