చికాగోలోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు
‘యువ ప్రవాసి భారతీయ దివస్ (PBD) 2027’ సందర్భంగా చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Chicago) ప్రవాస భారతీయ యువత కోసం అంతర్జాతీయ స్థాయి వ్యాస రచన పోటీని నిర్వహిస్తోంది. భారతీయ మూలాలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఈ పోటీని రూపొందించారు.
“From Roots to Return: Reigniting Diaspora Connect with Bharat” అనే అంశంపై ఈ వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు (పేరు, కాంటాక్ట్ వివరాలు) మరియు రాసిన వ్యాసాన్ని 2026 నవంబర్ 20 లోపు [email protected] ఇమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకున్న వారు మాత్రమే ఇందులో పాల్గొనాలి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చూపిన ఉత్తమ 100 మంది విజేతలకు (Top 100 participants) 2027 జనవరి 07 నుండి 09 వరకు కొల్కతాలో జరిగే “యువ PBD మరియు PBD 2027” కార్యక్రమాలలో నేరుగా పాల్గొనే అవకాశం వుంటుంది.






