న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీపావళి వేడుక న్యూయార్క్ లోని భారతీయ అమెరికన్ సమాజాన్ని ఓ చోట చేర్చినట్లైంది. అత్యంత ఉత్సాహంగా ఈ వేడుకలు సాగాయి.
ఈ కార్యక్రమాలలో కాన్సుల్ పీయూష్ సింగ్ పాల్గొన్నారు. దీపావళి ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగానే న్యూయార్క్ తమిళ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.

అలాగే భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని బెర్గెన్ కౌంటీ, బిండియా సహకారంతో దీపావళి వేడుకలు నిర్వహించగా, ఇందులో కాన్సుల్ మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బెర్గెన్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ జిమ్ టెడెస్కో, ఎన్జె ట్రాన్సిట్ ప్రెసిడెంట్ & సీఈఓ క్రిస్ కొల్లూరి, ఇతర ఎన్నికైన నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పిల్లలు భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందలాది మంది సమాజ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిండియా ఆధ్వర్యంలో 30 పట్టణాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలు ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చారు. ఇది స్థానిక సమాజంలో ప్రవాస భారతీయుల చురుకైన భాగస్వామ్యాన్ని చాటింది.







