జగన్కు మరో షాక్ .. పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడప జిల్లా (Kadapa District) పులివెందుల జడ్పీటీసీ (Pulivendula ZPTC) స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థి భారతి (Bharati) విజయం సాధించారు. 1,463 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓటమితో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ (YSRCP) నేతలు వెనుదిరిగారు. మరోవైపు మైదుకూరు జడ్పీటీసీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.







