తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక : మంత్రి పొన్నం
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి (Diwali) కానుకను ప్రకటించింది. మెట్రో(Metro)-ఆర్టీసీ (RTC) కామన్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. రూ.8500 ఉన్న నెలవారీ పాస్ (Pass) ధరను రూ.4 వేలకు తగ్గించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ప్రజలపై రవాణా ఖర్చుల భారం తగ్గించి, సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.రోజువారీ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు నెలవారీ పాస్‌ను రూ.8,500 నుంచి రూ.4,000కు కుదించినట్లు తెలిపారు. తగ్గించిన ధరలు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.







