సీఐఐ భాగస్వామ్య సదస్సు – అత్యంత సుందరంగా విశాఖ ముస్తాబు
రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న 31వ భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబవుతోంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఏయూ ఇంజినీరింగ్ మైదానం (AU Engineering)లో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సాంకేతికత, వాణిజ్యం నమ్మకం అనే థీమ్ తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సుకు 50కి పైగా దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ప్రధాన వేదిక, ఆరు సమావేశ మందిరాలు, బీ2బీ సమావేశాలకు ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu)తో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తదితరులు హాజరుకానున్నారు.







