టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఈవో ముద్దాడ రవిచంద్ర (Ravichandra) బాధ్యతలు స్వీకరించారు. బీఆర్నాయుడు (B.R. Naidu) నేతృత్వంలోని పాలకమండలి పదవీకాలం ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం టీటీడీ ఈవో చైర్మన్గా మరో ఇద్దరు ఉన్నతాధికారులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నూతన చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్మమని రవిచంద్ర తెలిపారు. జేఈవో ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ (Muralikrishna), ఇతర అధికారులు పాల్గొన్నారు.







