చీరాల మున్సిపాలిటీ టీడీపీ కైవసం
ఉత్కంఠగా సాగిన పుర పోరులో బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ (Chirala Municipality)ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి ఎరిచెర్ల హనీ స్పందన ( Honey Spandana) సమీప ప్రత్యర్థిపై 6,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.చీరాల పురపాలక సంఘంలో మొత్తం 44 వార్డులు ఉండగా 22 చోట్ల తెలుగుదేశం, కాంగ్రెస్(Congress) 10, వైసీపీ 8, జనసేన( Jana Sena) 2, బీజేపీ (BJP) 1, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.







