నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన..
నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన..
మధ్యాహ్నం దుద్యాల మండలం హకీంపేటకు సీఎం రేవంత్ రెడ్డి.
రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పో ప్రారంభించనున్న సీఎం
రూ.9,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం
రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
2.30 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించనున్న సీఎం.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్న సీఎం.
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం.
సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు హకీంపేటఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి.
అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకోనున్న సీఎం.







