అందంతో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల
పెళ్లి సందడిD(Pelli sandaD) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల(Sree Leela) తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు రెగ్యులర్ అప్డేట్స్ ను అందిస్తూ టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే శ్రీలీల తాజాగా సిల్వర్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్ లో మెరిసింది. స్టోన్స్, పర్ల్స్ తో రూపొందించిన ఈ డ్రెస్ లో శ్రీలీల ఎంతో గ్రాండ్ గా, సింపుల్ మేకప్, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో పాటూ డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఆమె అందాన్ని మరింత పెంచగా, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.







