హ్యాలోవీన్ వేడుకల్లో సైనికుల కోసం CANDY DRIVE చేపట్టిన TAGB
విదేశాల్లో దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న అమెరికన్ సైనికులకు (US Troops) ఈ హ్యాలోవీన్ పండుగ వేళ ప్రత్యేక కేర్ ప్యాకేజీలను అందించేందుకు “TAGB” ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హ్యాలోవీన్ వేడుకల్లో సైనికుల కోసం మిఠాయిల సేకరణను చేస్తున్నట్లు తెలిపారు. అమెరికన్ సైనికులు చేస్తున్న సేవలను దృష్టిలో వుంచుకొని, మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 8 వ తేదీ కల్లా వీటిని పంపించాలని నిర్వాహకులు తెలిపారు.
TAGB HALLOWEEN CANDY DRIVE లో భాగంగా ప్రజలు తమ హ్యాలోవీన్ మిఠాయిలు, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు, నట్స్ ను సేకరించి, సైనికులకు విరాళంగా అందించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
విరాళంగా ఇవ్వాల్సినవి ఇవే..
తెరవని, చుట్టబడిన మిఠాయిలు (చాక్లెట్ మరియు చాక్లెట్ కానివి)
చుట్టబడిన ట్రీట్ మిశ్రమాలు (Wrapped treat mixes)
విరాళాలు అందించాల్సిన చిరునామా 7 Curren Drive, Westford MA 01886







