3rd November2026

_________

- Bhuvana

దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఈ 8 సైబర్ మోసాల పట్ల జాగ్రత్త!

భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఫ్రీ గిఫ్ట్‌లు.. దీపావళి షాపింగ్‌లో ఇవన్నీ ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ వీటి వెనుక సైబర్ నేరగాళ్ల ఉచ్చులు కూడా ఉన్నాయి. ఈ 10 మోసాల గురించి తప్పక తెలుసుకోండి!

దీపావళి షాపింగ్‌లో సైబర్ ట్రాప్!

ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తారు. భారీ ఆఫర్లతో ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తారు. చివరకు వస్తువులు పంపరు. మీ వ్యక్తిగత వివరాలనూ దొంగిలించే ప్రమాదం ఉంది.

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు

ప్రముఖ బ్రాండ్ల పేర్లు, లోగోలతో నకిలీ యాప్స్ తయారు చేస్తారు. APK ఫైల్స్ పంపించి వాటిని ఇన్‌స్టాల్ చేయిస్తారు. వాటి ద్వారా మీ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించే అవకాశం ఉంది.

నకిలీ షాపింగ్ యాప్‌లు

బ్రాండెడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్ల పేరుతో నకిలీ ప్రకటనలు ఇస్తారు. నిజమైన కంపెనీల ఫొటోలు, వీడియోలతో నమ్మిస్తారు. డబ్బులు తీసుకున్న తర్వాత పేజీని తొలగిస్తారు లేదా బ్లాక్ చేస్తారు.

నకిలీ సోషల్ మీడియా ప్రకటనలు

దీపావళి గిఫ్ట్‌లు, క్యాష్‌బ్యాక్‌ల పేరుతో QR కోడ్ పంపిస్తారు. స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. డబ్బులు పంపుతామని చెప్పి ఫేక్ పేమెంట్ రిక్వెస్టులు కూడా పంపిస్తారు.

QR కోడ్ & UPI మోసం

బ్యాంకులు, పేమెంట్ యాప్స్ పేరుతో ఫెస్టివల్ బోనస్‌లు, రివార్డులు ఇస్తామంటారు. లింకులు క్లిక్ చేయించి వివరాలు సేకరిస్తారు. కొన్నిసార్లు రివార్డు విడుదల చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు కూడా అడుగుతారు.

నకిలీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

మీ ఆర్డర్ డెలివరీ నిలిచిపోయిందని, అడ్రస్ వెరిఫికేషన్ అవసరమని మెసేజ్ పంపిస్తారు. చిన్న డెలివరీ ఛార్జీ చెల్లించాలంటూ లింక్ ఇస్తారు. దాన్ని క్లిక్ చేస్తే మీ బ్యాంకింగ్ వివరాలు నేరగాళ్లకు చేరవచ్చు.

నకిలీ డెలివరీ సందేశాలు

నకిలీ కస్టమర్ కేర్ నంబర్లతో మోసాలకు పాల్పడతారు. రిఫండ్ ఇప్పిస్తామని చెప్పి AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఆ తర్వాత మీ ఫోన్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేసి డబ్బులు దొంగిలిస్తారు.

నకిలీ కస్టమర్ కేర్ మోసం

లక్కీ డ్రా పేరుతో ఖరీదైన బహుమతులు గెలిచారని నమ్మిస్తారు. ప్రైజ్ పొందాలంటే ట్యాక్స్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటారు. వాట్సాప్‌లో ఫేక్ గిఫ్ట్ వోచర్లు, గ్రీటింగ్ కార్డుల లింకులు పంపించి వ్యక్తిగత వివరాలు దొంగిలిస్తారు.

లక్కీ డ్రా & వాట్సాప్ స్కామ్‌లు

1930: వెంటనే సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి, cybercrime.gov.in: ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి, మీ బ్యాంక్ అధికారిక హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వండి, ట్రాన్సాక్షన్ వివరాలు, స్క్రీన్‌షాట్లు భద్రపరచండి, స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించండి.

Cyber Fraud జరిగితే ఏం చేయాలి?