మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ట్రంప్ కు ఎదురుదెబ్బ..!
అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(TRUMP) కోర్టుల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలిఫోర్నియాలో సుమారు 20 వేల వివాదాస్పద మెయిల్ బ్యాలెట్లను పక్కన పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. చివరకు అమెరికా సుప్రీంకోర్టు కూడా ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించింది.
20 వేల మంది ఓటర్లపై అనుమానాలు
కాలిఫోర్నియాలో సుమారు 20 వేల మంది ఓటర్లు అమెరికా పౌరులు కాకపోవచ్చని ట్రంప్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది.వీరు ఓటు వేయడానికి అర్హులు కాదని అమెరికా న్యాయశాఖ (DOJ) ఆరోపించింది.ఈ ఓటర్లకు సంబంధించిన బ్యాలెట్లను వెంటనే పక్కన పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరింది.
ట్రంప్ సర్కార్ ఆరోపణలపై కాలి ఫోర్నియా ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనికి కాలిఫోర్నియా(CALI FORNIA).. పలు అంశాలను లేవనెత్తింది. ఇందులో..కాలిఫోర్నియాలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.లక్షలాది మంది ఓటర్లు తమ బ్యాలెట్లను తిరిగి పంపించారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో అనేక తప్పులున్నాయని కాలిఫోర్నియా అధికారులు వాదించారు.ఆ జాబితాలో అమెరికా పౌరులు, ఓటరు నమోదును క్రియాశీలంగా కొనసాగించని వ్యక్తులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ట్రంప్ నకు ఎదురుదెబ్బ
ట్రంప్ ప్రభుత్వం బ్యాలెట్లను వేరు చేయాలంటూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది.
అయితే జిల్లా కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.ఆ తర్వాత 9వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టులోనూ 2-1 మెజారిటీతో ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఓటు హక్కు ఉన్నవారి ఓట్లు కూడా చెల్లకుండా పోయే ప్రమాదం ఉందని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు
నవంబర్ 2, 2026న ట్రంప్ ప్రభుత్వం అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాదాస్పద బ్యాలెట్లను తాత్కాలికంగా పక్కన పెట్టాలని అత్యవసరంగా కోరింది.కానీ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.







