3rd November 2026

_________

- Bhuvana

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ నష్టాలు తెలుసా?

నిద్రలేవగానే మెసేజ్‌లు, ఇమెయిల్స్, వార్తలు చూడడం వల్ల మెదడుపై ఒక్కసారిగా సమాచారం భారమై మానసిక ఒత్తిడి పెరగవచ్చు.

ఒత్తిడి పెరిగే అవకాశం

ఉదయం నుంచే సోషల్ మీడియా, నోటిఫికేషన్లలో మునిగితే రోజంతా పనిపై దృష్టి నిలబెట్టుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంది.

ఏకాగ్రత తగ్గవచ్చు

రోజును సోషల్ మీడియాతో ప్రారంభించడం వల్ల ఇతరులతో పోల్చుకునే భావన పెరిగి మూడ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇతరులతో పోల్చుకునే అలవాటు

ఫోన్‌లో సమయం గడపడం వల్ల నీరు తాగడం, వ్యాయామం, ధ్యానం, అల్పాహారం వంటి మంచి అలవాట్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

ఉదయం రొటీన్ దెబ్బతింటుంది

పని సందేశాలు లేదా నెగెటివ్ వార్తలు ఉదయాన్నే చూడడం కొందరిలో ఆందోళనను పెంచి రోజంతా మానసిక ప్రశాంతతను తగ్గించవచ్చు. 

ఆందోళన పెరగొచ్చు

రోజును మీ ప్రాధాన్యాలతో కాకుండా ఫోన్ నోటిఫికేషన్లతో ప్రారంభిస్తే పనుల ప్రణాళిక, ఉత్పాదకతపై ప్రభావం పడవచ్చు.

ఉత్పాదకతపై ప్రభావం