ప్రవాసాంధ్రుల కోసం నాట్స్ ఉచిత వైద్య శిబిరం..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఇప్పటికే సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీని వల్ల అనేక మంది లాభపడుతున్నారు కూడా. ఇందులో భాగంగానే డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు ప్రజల కోసం ‘‘ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం’’ నిర్వహించనున్నారు.
కారోల్టన్ రీజినల్ మెడికల్ సెంటర్ (CRMC) సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నాట్స్ నిర్వాహకులు తెలిపారు. అనారోగ్య సమస్యల నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అక్టోబర్ 31 వ తేదీన, 4343 N Josey Ln, Carrollton, TX 75010 వేదికగా ఈ ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ వైద్య శిబిరంలో అందించే ప్రధాన సేవలివీ…
జనరల్ ఫిజికల్ ఎగ్జామ్ (General Physical Exam)
పోషకాహార సలహాలు (Nutritional Advice)
రక్తపోటు పరీక్ష (Blood Pressure Check-up)
బి.ఎం.ఐ గణన (BMI Calculation)
బ్లడ్ గ్లూకోజ్ (Blood Glucose) పరీక్ష
హెచ్‌బిఎ1సి (HbA1c) పరీక్ష
కొలెస్ట్రాల్ (Cholesterol) పరీక్ష
నాట్స్ చైర్మన్ కిశోర్ కంచర్ల మరియు ప్రెసిడెంట్ రాజ్ అల్లాడల నేతృత్వంలో జరుగుతున్న ఈ సేవలను డల్లాస్ ప్రాంతంలోని తెలుగువారందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నినాదంతో ముందుకు సాగుతోంది నాట్స్.
రిజిస్ట్రేషన్ కోసం: చిత్రంలో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేయవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ natsworld.org/dallasmedicalcamp ని సందర్శించవచ్చు.
మరిన్ని వివరాల కోసం ….
కిరణ్: 309-648-2675
పావని: 781-640-7461
సౌజన్య: 630-596-7445








