అర్నబ్ తుపాను ఎఫెక్ట్ … పలు విమానాలు, రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్ లో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలుతో భారీవర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలుల ధాటికి కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. తీరప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే పలు విమానాలు రద్దయ్యాయి. అర్నబ్ తుపాను వల్ల 33 విమానాలను అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ (Shamshabad) నుంచి వెళ్లాల్సిన 17, ఏపీ నుంచి రావాల్సిన 16 విమానాలను అధికారులు బుధవారం రద్దు చేశారు. రద్దయిన వాటిలో శంషాబాద్ నుంచి విశాఖపట్నం(Visakhapatnam), విజయవాడ (Vijayawada), రాజమహేంద్రవరం (Rajamahendravaram) వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి.
అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేశాఖ అప్రమత్తతమై ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. ఇవాళ్టి నరసాపురం-తూత్తుకుడి రైలు(06020), నరసాపురం-తిరువణ్ణామలై రైలు(17291) రద్దయ్యాయి. అదేవిధంగా తిరువణ్ణామలై-నరసాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్(06019) రైలు భీమవరం వద్దే అధికారులు నిలిపేశారు. 08584 ఎస్ఎంవి బెంగళూరు-విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్ సా. 4.40 గంటలకు రీ షెడ్యూల్ చేయనున్నారు.








