న్యూయార్క్ అటార్నీ జనరల్ పోటీలో తెలంగాణ మహిళ
అమెరికాలోని న్యూయార్క్ అటార్నీ జనరల్ (New York Attorney General) మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మూలాలున్న మహిళ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముంపు గ్రామమైన చెగ్యాంకు చెందిన హనుమంతరెడ్డి, గీతారెడ్డిల కుమార్తె సరితారెడ్డి (Sarita Reddy) న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరపున బరిలో ఉన్నారు. సుమారు 45 ఏళ్ల క్రితమే హనుమంతరెడ్డి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. సరితారెడ్డి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు కాగా, బ్రూక్లిన్ సిటీ (Brooklyn City)లో పుట్టి, పెరిగిన ఆమె న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో స్వగ్రామంలో బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







