సీఎం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఫోన్ చేశారు. మురుసు తుపాను ప్రభావం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు అమిత్ షా హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టి తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు. ఇటీవల వచ్చిన అర్నబ్ తుపాను నష్టం నుంచి కోలుకోకముందే మురుసు రావడంతో నష్టం తీవ్రత పెరిగిందని సీఎం తెలిపారు. వివిధ జిల్లాల్లో పంట, ఆస్తి నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.







