మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు
కడప జిల్లా (Kadapa District) పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు పులివెందుల ఆర్వో కార్యాలయం (RO Office) వద్ద వైసీపీ నేతలు, ఏజెంట్లతో కలిసి జగన్ ధర్నా చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల (Pulivendula ) మున్సిపాలిటీ లో తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ జగన్ నిరసన చేపట్టారు.







