తెలుగు సమితి నాష్విల్లే ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ సంబరాలు
తెలుగు సమితి నాష్విల్లే ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఐ్యతకు చిహ్నంగా ఈ వేడుకలు జరిగాయి. అందమైన బతుకమ్మలు, సంప్రదాయ, సంగీతంతో కూడిన సుందరమైన నృత్యాలతో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో అన్ని వయస్సుల వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అద్భుతమైన బతుకమ్మ ఏర్పాట్లు, ఉత్సాహభరితమైన భాగస్వామ్యం మరియు ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలతో మరుపురాని సన్నివేశంగా అయ్యింది.

తెలంగాణ సంప్రదాయంలో అగ్ర తాంబులంలా వుండే బతుకమ్మ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. మహిళలందరూ ముక్త కంఠంతో బతుకమ్మ పాటలను పాడటం, ఏకరీతిలో బతుకమ్మ ఆడటం అందర్నీ ఆకట్టుకుంది.

Screenshot
ఈ వేడుక సందర్భంగా వెండార్స్ కూడా ఏర్పాటు చేశారు.ఇందులో దేవతా చిత్రాలతో పాటు పెయింటింగ్స్, పాటు వివిధ రకాలైన డ్రెస్ మెటీరియల్స్ ని కూడా అందుబాటులో వుంచారు. చివరగా ఆ సంబరాలకు సహకరించిన వాలెంటీర్లకు, విచ్చేసిన వారికి తెలుగు సమితి నాష్ విల్లే ధన్యవాదాలు ప్రకటించింది.






