కాంగ్రెస్ పై బీజేపీ తప్పుడు ప్రచారం : మంత్రి పొన్నం
కాంగ్రెస్ (Congress)ను విమర్శించడానికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన పరిమితమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శంచారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలపై ఆయన ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. చొరబాటుదారుల ఓటు హక్కుకు తాము వ్యతిరేకమన్న ఆయన, కాంగ్రెస్ పై బీజేపీ (BJP) నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్ల తొలగింపుపైనే కాంగ్రెస్ ప్రశ్నిస్తోందన్నారు. దేశంలో ఏఏ (అంబానీ, అదానీ) ట్యాక్స్ నడుస్తోంది. ముగ్గురు గుజరాతీయుల కోసమే మోదీ, అమిత్ షా పని చేస్తున్నారు. అన్నీ అదానీకి కట్టబెడుతున్నారు. దేశాన్ని అదానీకరణ చేస్తున్నారు. మీ హామీల గురించి బహిరంగ చర్చకు మీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమా? ఎన్నినో ప్రభావం, కరవుపై కేంద్రం సహాయం చేయాలి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎసఐఆర్పై చర్చ చేపట్టాలి అని డిమాండ్ చేశారు.







