ప్రత్యర్థి ఆహర వినాశనమే గురి..ఆధునికయుద్ధ తంత్రం.. !
రాజుల కాలం నుంచి నేటి వరకూ యుద్ధమంటే యుద్ధమే.. అందులో గెలవడానికి వేయని ఎత్తులు లేవు.. అనుసరించని మంత్రాంగం ఉండదు. అప్పట్లో రాజుల కోటలను ముట్టడించే ప్రత్యర్థి రాజులు… వారి కోటను అష్ట దిగ్భందనం చేసేవారు. కోటలోకి ఎలాంటి వస్తువులు రాకపోకలు వెళ్లకుండా కట్టుదిట్టం చేసేవారు. అంతేకాదు…కోటలోని ఆహారం అయిపోయే వరకూ వేచి ఉండే.. తర్వాత ప్రత్యర్థి బలహీన పడ్డాడని రూడి చేసుకుని దాడి చేసేవారు. దీంతో ప్రత్యర్థితో పెద్దగా ప్రతిఘటన లేకుండానే విజయం సాధించే వ్యూహమిది.
దీన్ని ప్రస్తుత యుద్ధ తంత్రంలోనూ వాడుతున్నారు. దేశాలు నౌకలను గురి పెట్టి..రాకపోకలను నిషేధిస్తే .. ఉగ్రవాద బృందాలు.. నేరుగా ఆహారానికే గురిపెడుతున్నాయి. యుద్ధంలో ఉన్న సైనికులకు ఎప్పటికప్పుడు వండి, వాటిని పెట్టేపరిస్థితి ఉండదు. అందుకే ఆహారాన్ని రెడీమేడ్ గా మార్చి , ఫ్రీజర్ లలో జాగ్రత్త పరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని .. వినియోగించేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఉగ్రబృందాలు .. ఈ ఫ్రీజర్లనే టార్గెట్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
తాజాగా మూకుమ్మడిగా ఆహార పదార్థాలను నిల్వ ఉంచే ఫ్రీజర్లపై సైబర్ దాడులు చేయడం కలకలం రేపుతోంది.. ఫలితంగా ఆహార కొరత సృష్టించడంతోపాటు భారీగా నష్టపరచడం దీని ఉద్దేశం. గత ఆగస్టులో అమెరికాలోని సైనిక స్థావరాల్లో ఉన్న ఫ్రీజర్లపై సైబర్ దాడి చేసిన హ్యాకర్లు.. గత నెలలో ఫ్రాన్స్‌లోని సూపర్ మార్కెట్లలోని ఫ్రీజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సోమవారం యూరప్ లోని స్వీడన్, బెల్జియం తదితర దేశాల్లో ఉన్న సూపర్ మార్కెట్లపై సైబర్ దాడులు జరిగాయి. ఫలితంగా ఆహారాన్ని పడేయాల్సి వచ్చింది.
అసలేంటీ దాడి..
సూపర్ మార్కెట్ల చైన్ దుకాణాల్లో కేంద్రీకృత కూలింగ్ వ్యవస్థలుంటాయి. వాటిలో కూలింగ్ వ్యవస్థలను నిర్వహించడంతోపాటు అలారం వంటి సౌకర్యాల కోసం రిమోట్ యాక్సెస్‌ను వాడతారు. తద్వారా టెక్నీషియన్ ప్రతి సూపర్ మార్కెట్‌కు వెళ్లకుండా ఒక్కచోట నుంచే పర్యవేక్షిస్తారు. దీంతో వాటినే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తున్నారు.
జాగ్రత్తలేంటి?
కూలింగ్ వ్యవస్థలకు సంబంధించిన పరికరాలన్నీ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలి. వాటి రిమోట్ యాక్సెస్‌ను పరిరక్షించాలి.







