అందుకే స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు : మంత్రి అనగాని
బీసీలకు రాజ్యాధికారం దక్కడం వైసీపీ అధినేత జగన్ (Jagan)కు ఇష్టం లేదని, అందుకే స్థానిక ఎన్నికల్ని అడ్డుకోవడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి పక్షాలు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించినట్లు వెల్లడించారు. మేయర్ (Mayor) స్థానాల్లో 53.85 శాతం, మున్సిపల్ చైర్పర్సన్ (Municipal Chairperson) స్థానాల్లో 41.56 శాతం, నగర పంచాయతీల్లో 60 శాతం బీసీలకు కేటాయించాం. వెనుకబడిన తరగతులకు కేవలం హామీలివ్వడం కాదు, వాటిని అమలు చేసి చూపిస్తున్నాం అని తెలిపారు.







